ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా నెట్ వర్క్ Jio, ఈరోజు JioAirFiber లను భారత దేశంలో అనౌన్స్ చేసింది. దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ కిలోమీటర్ల వరకూ విస్తరించిన Jio's optical fiber infrastructure ద్వారా ప్రతీ ఇంటికీ వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించడానికి JioAirFiber సహకరిస్తుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేదా డిపాజిట్ వంటి చిక్కులు లేకుండా జియో ఫైబర్ తో 4k Smart Set Top Box, వాయిస్ రిమోట్ మరియు WiFi router ను కూడా రిలయన్స్ జియో అందిస్తోంది.
ప్రస్తుతానికి Jio AirFiber కోసం ఎటువంటి రుసుమును వసూలు చేయడం లేదని కంపెనీ చెబుతోంది. అయితే, ఇది అన్ని ప్లాన్స్ పైన లేక కొన్ని ప్లాన్స్ పైన అనే విషయం క్లారిటీ రావలసి వుంది. అయితే, వెబ్సైట్ లో కంపెనీ తెలిపిన ప్రకారం ప్రస్తుతం ఈ ప్లాన్స్ 6 నెలలు లేదా 12 నెలల దీర్ఘకాలిక రీచార్జ్ లతో మాత్రమే లభిస్తోంది. అంటే, ఈ ప్లాన్ లతో మాత్రమే ఈ ఉచిత లాభాలను పొందే వీలుంటుంది.
Introducing JioAirFiber! India's latest home entertainment and Wi-Fi service.
— Reliance Jio (@reliancejio) September 19, 2023
Now available. https://t.co/9WCqQdmViM#JioAirFiber pic.twitter.com/4QB2msbceI
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ ను లను రెండు కేటగిరిలలో జియో అందించింది. ఇందులో Jio Air Fiber మరియు Jio Air Fiber Max కేటగిరిలు ఉన్నాయి. Jio Air Fiber లో 30 Mbps మరియు 100 Mbps స్పీడ్ వారీగా ప్లాన్స్ ను అఫర్ చేస్తోంది. Jio Air Fiber Max కేటగిరీ నుండి 300 Mbps, 500 Mbps మరియు 1000 Mbps హెవీ స్పీడ్ తో ప్లాన్ లను అందిస్తోంది. ఈ ప్లాన్స్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
అయితే, ఇక్కడ చూపించిన అన్ని ప్లాన్స్ పైన కూడా GST ను జత చేస్తుందని గుర్తుంచుకోండి. ఇక్కడ సూచించనవి బేసిక్ ప్రైస్ వివరాలు మాత్రమే మరియు దీనికి GST అదనం అని జియో తెలిపింది.
Jio Airfiber ప్లాన్ యొక్క 12 నెలల ప్లాన్ రీఛార్జ్ చేసే వారికి కోసం కంపెనీ ఎటువంటి installation వసూలు చేయడం లేదని తెలిపింది.
ప్రస్తుతం jio AirFiber హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ దేశవ్యాప్తంగా 8 మెట్రో సిటీలలో అందుబాటులో వుంది. అందులో, మన హైదరాబాద్ నగరం తో పాటు బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, కలకత్తా, ముంబై మరియు పూణే సిటీలు ఉన్నాయి.