బడ్జెట్ ధరలో పెద్ద 120Hz QLED స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన Hisense.!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 19 Sep 2023 18:52 IST
HIGHLIGHTS
  • డ్జెట్ ధరలో గొప్ప ఫీచర్లతో 120Hz QLED స్మార్ట్ టీవీ ని లాంచ్

  • Hisense సరికొత్త QLED స్మార్ట్ టీవీ ప్రస్తుతం Pre-Booking కోసం అందుబాటులో వుంది

  • ఈ హైసెన్స్ QLED స్మార్ట్ టీవీ పైన భారీ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా కంపెనీ అందించింది

బడ్జెట్ ధరలో పెద్ద 120Hz QLED స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన Hisense.!
బడ్జెట్ ధరలో పెద్ద 120Hz QLED స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన Hisense.!

ఇండియాలో కేవలం బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్లతో 120Hz QLED స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసింది Hisense. ఈ సరికొత్త QLED స్మార్ట్ టీవీ ప్రస్తుతం Pre-Booking కోసం అందుబాటులో వుంది మరియు కేవలం రూ. 500 చెల్లించి ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ ని ప్రీ బుక్ చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ ను సెప్టెంబర్ 29 వ 12 am నుండి తేదీ రాత్రి 11:59 pm లోపుగా కేవలం రూ.500 చెల్లించి కొనుగోలు చెయ్యవచ్చు. ఈ హైసెన్స్ QLED స్మార్ట్ టీవీ పైన భారీ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా కంపెనీ అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ స్పెక్స్ మరియు ధర వివరాలు వివరంగా తెలుసుకుందామా. 

Hisense (43 inches) 4K Ultra HD QLED Price 

హైసెన్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ 4K Ultra HD QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43U6K గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ 4K Ultra HD QLED స్మార్ట్ టీవీ ని రూ. 25,999 లాంచ్ అఫర్ ధరతో కంపెనీ ఇండియాలో విడుదల చేసింది. ఈ QLED టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here 

Hisense (43 inches) 4K Ultra HD QLED specs 

ఈ హై సెన్స్ స్మార్ట్ టీవీ 4K Ultra HD (3840x2160) రిజల్యూషన్ కలిగిన ALLM VRR సపోర్టెడ్ 120Hz HRR ప్యానెల్ తో వస్తుంది. ఇది Quantum Dot Colour QLED డిస్ప్లే మరియు ఇది Dolby Vision, HDR10, HLG సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క మరోక గొప్ప విషయం ఏమిటంటే కంపెనీ ఈ QLED స్మార్ట్ టీవీ పైన 4 Year Comprehensive Warranty ని కూడా అందిస్తోంది. ఈ టీవీ కొనుగోలు చేసిన నాటి నుండి 4 సంవత్సరాల వరకు ఈ టీవీ పైన ఈ వారెంటీని అందిస్తుంది హైసెన్స్.

Hisense 120Hz QLED Smart Tv features

ఈ Hisense 43 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB 2.0, Bluetooth 5 మరియు Dual-band Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 2GB RAM + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడ కలిగి వుంది. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

Hisense launches 120Hz QLED smart tv under budget price in india

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు